AP Home Minister: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే, కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ.. బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో సురేష్ పై ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు జైలుకు పంపారు. 20 రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్.. జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని ఈ ఘాతుకానికి సురేష్ పాల్పడ్డారు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక.. అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ తొమ్మిదవ తరగతి విద్యార్థి పీక కోసి పరార్ అయ్యాడు.
Read Also: Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?
అయితే, సంఘటన జరిగిన కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైకో సురేష్ కదలికల మీద నిఘా పెట్టుంటే తమ కూతురు ప్రాణం పోయిండేది కాదు అని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితుడికి తక్షణమే శిక్ష పడకపోతే తాను కత్తితో పొడుకుని చచ్చిపోతాను అని బాలిక తండ్రి హెచ్చరించాడు.