విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్‌పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు. ప్రజలెవ్వరు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపిన హోంమంత్రి… ఎప్పటికప్పుడు సహాయకచర్యల గురించి ఫోన్ లో మాట్లాడి తెలుసుకుంటున్నారు.