Site icon NTV Telugu

AP High Court: అరెస్టైన మావోయిస్టులను కోర్టు ముందు హాజరుపర్చాలని పిటిషన్..

High Court

High Court

AP High Court: మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డి కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్లు చేసిన అభ్యర్థనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విచారణలో భాగంగా, దేవజీ, మల్లా రాజిరెడ్డి తమ అదుపులో లేరని పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి. అలాగే, అరెస్ట్ చేసిన మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట నియమిత విధానంలోనే హాజరుపర్చినట్లు కూడా పోలీసులు వివరణ ఇచ్చారు.

Read Also: Ghattamaneni Jayakrishna: జయకృష్ణ డెబ్యూ సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

అయితే, మావోయిస్టు నేతలు తమ అదుపులో ఉన్నారని పోలీసులు ముందుగా ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది, ఆ ప్రెస్ స్టేట్మెంట్‌ను కోర్టు ముందు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టులు పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని నిరూపించే ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version