పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిగింది. అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామ చంద్రయ్య పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాగా.. తమ వాదన వినడానికి సమయం ఇవ్వలేదని ఎమ్మెల్యేలు తెలిపారు. నోటీసులు ఇవ్వడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
Read Also: Chandrababu: ‘రా కదలిరా’ సభలో గందరగోళం.. కిందపడబోయిన చంద్రబాబు
ఈ క్రమంలో.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం.. తీర్పు రిజర్వ్ చేసింది.
Read Also: Vijayawada: విజయవాడ దుర్గగుడి పాలకమండలి నిర్ణయాలు ఇవే..
