ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.. ప్రతిపక్షాల నేతలే కుండా హిందూ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.. కొన్ని ప్రాంతాల్లో నిరసన, మౌన దీక్షలు సైతం చేపట్టారు. అయితే, వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు.. ఇక, మతపరమైన కార్యక్రమాలు నిరోధించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఇదే సమయంలో.. పబ్లిక్ ప్లేస్‌ల్లో విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా సమర్థించిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సర్కార్‌కు సూచించింది.
వినాయక చవితి ఉత్సవాలు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
