AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో.. ఈ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటం గ్రామస్తులు హైకోర్టులో మరోసారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై విధించిన జరిమానాను తగ్గించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం నాడు డిస్మిస్ చేసింది.
Read Also: Karnataka: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్.. 18 మంది విద్యార్థులు సస్పెండ్
కాగా రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటంలో గ్రామంలో కొంత మంది ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ఈ ఘటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.