NTV Telugu Site icon

Challa Srilakshmi: జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మికి వన్ ప్లస్ వన్ గన్ మెన్ కేటాయింపు

Challa owk

Collage Maker 03 Jan 2023 03.54 Pm

దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కోడలు, జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మికి భారీ భద్రత కల్పించారు పోలీసులు. ఆమెకు వన్ ప్లస్ వన్ గన్ మెన్ కేటాయించారు జిల్లా ఎస్పీ. అవుకులో చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విబేధాలు వీధికెక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చల్లా కుటుంబంలో విబేధాల నేపథ్యంలో సీఎం జగన్ వద్ద పంచాయతీ పెట్టిన చల్లా శ్రీలక్ష్మి అసలు పరిస్థితుల్ని ఆయనకు వివరించిన సంగతి తెలిసిందే. సీఎం ను కలసిన కొన్ని గంటలకే గన్ మెన్స్ కేటాయించింది ప్రభుత్వం. చల్లా కుటుంబంలో వివాదాల పరిష్కారానికి అధిష్టానం ఆదేశంతో రంగంలోకి దిగారు కాటసాని రామిరెడ్డి.

అవుకులో ఆసక్తికర పరిణామాలు నిశితంగా గమనిస్తున్నారు స్థానిక ప్రజలు.నంద్యాల జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ విభేదాలు చల్లా సమాధి సాక్షిగా వీధిలో కెక్కి రచ్చ రచ్చగా మారాయి.చల్లా కుటుంబ విభేదాల పంచాయతీ సాక్షాత్తు సీఎం జగన్ వద్దకు చేరడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది .ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి సీఎంను కలిసిన కొద్ది గంటల్లోనే ఆమెకు రక్షణ కవచంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గన్ మెన్ల ను నియమించారు.

Read Also: Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. 20ఏళ్ల వయసులో ఉంటే..?

చల్లా కుటుంబంలో చెలరేగిన విభేదాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారి రచ్చ రచ్చ గా మారడంతో వైసిపి అధిష్టానం ఆదేశాల మేరకు చల్లా కుటుంబంలో వివాదాల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రంగంలోకి దిగారు. చల్లా కుటుంబీకుల మధ్య ఏర్పడిన విభేదాలపై చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విగ్నేశ్వర్ రెడ్డి, చల్లా సోదరులు సూర్య ప్రకాశ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డిలతో సుదీర్ఘంగా చర్చిస్తు ఎమ్మెల్యే కాటసాని. మంతనాలను కొనసాగించారు. చల్లా రామకృష్ణారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా అవుకులోని చల్లా ఫామ్ హౌస్ లో చల్లా రామకృష్ణారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నుండి కుటుంబ వర్గ విభేదాలు బగ్గుమని బట్టబయలు అయ్యాయి.

చల్లా కుటుంబంలో విభేదాలు సునామీ సృష్టిస్తు ఉండడంతో చల్లా కుటుంబ రాజకీయం పై జిల్లా ప్రజలందరి దృష్టి ఇప్పుడు చల్లా కుటుంబం పైనే పడింది. ఆదివారం రాత్రి చల్లా కుటుంబీకుల మధ్య ఏర్పడిన ఘర్షణ విభేదాలు చోటు చేసుకున్న అనంతరం చల్లా నివాసం నుండి చల్లా శ్రీలక్ష్మి అవుకు నుండి నేరుగా విజయవాడ వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. చల్లా శ్రీలక్ష్మి , చెప్పిన విషయాలన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరంగా విని భగీరధ్ కుటుంబానికి దేవుడు కచ్చితంగా న్యాయం చేస్తాడని హామీ ఇవ్వడంతో పాటు చల్లా శ్రీలక్ష్మికి గన్ మెన్లను కూడా కేటాయించడం జరిగింది. త్వరలోనే చల్లా శ్రీలక్ష్మి గన్ మేన్ల రక్షణతో అవుకు రానున్నట్లు సమాచారం. చల్లా కుటుంబంలో ఏర్పడిన పరిణామాలను స్థానికులు పలుచోట్ల గుంపులుగా చేరి ఆసక్తిగా గమనిస్తూ చర్చించుకుంటు గుసగుసలాడడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో చల్లా కుటుంబంలో రాజకీయ పరిణామాలు ఎటువైపు వెళతాయో చూడాలి.

Read ALso: Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. 20ఏళ్ల వయసులో ఉంటే..?