NTV Telugu Site icon

ఏపీ స‌రికొత్త రికార్డ్ః ఒక్క‌రోజులో 10 ల‌క్ష‌ల వ్యాక్సిన్‌లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో రికార్ఢ్ ను సాధించింది.   వ్యాక్సినేష‌న్ ను వేగంగా అందిస్తున్న రాష్ట్రాల్లో ఒక‌టిగా నిలిచింది ఏపీ.  ఈరోజు మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను చేప‌ట్టింది.  ఒక్క‌రోజులో 10 ల‌క్ష‌ల టీకాల‌ను వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్యాహ్నం మూడున్న గంట‌ల వ‌ర‌కే ఆ టార్గెట్‌ను రీచ్ అయింది.  గ‌తంలో ఏపీలో ఒక్క‌రోజులో 6 ల‌క్ష‌ల టీకాలు వేశారు.  కాగా, ఆ రికార్డును బ‌ద్ద‌లుకొట్టి 10 ల‌క్ష‌ల టీకాల‌ను వేసింది.  

Read: అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్

తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 1,25,679 వ్యాక్సిన్లు వేయ‌గా, అత్య‌ల్పంగా విజ‌య‌న‌గ‌రంలో 48,689 వ్యాక్సిన్ డోసులు వేశారు. పశ్చిమ గోదావ‌రి జిల్లాలో 1, 21,389, కృష్ణా: 1,08,730,విశాఖ: 94, 913, శ్రీకాకుళం: 77,742, గుంటూరు: 80,857, నెల్లూరు: 70, 359, ప్రకాశం: 73, 759, చిత్తూరు: 72,544, కర్నూలు: 60, 669, అనంత: 56, 811, కడప: 50, 091 డోసులు వేసిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.