AP Govt: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. రూ. 1,410తో 11 వస్తువులను బేబీ కిట్ ద్వారా పంపిణీ చేయనున్న ఏపీ సర్కార్. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గతంలో ప్రజాదరణ పొందిన ఈ బేబీ కిట్ ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, 2014-19 మధ్య అమలు చేసిన ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ ను అందజేస్తుంది.
అయితే, దోమ తెరతో కూడిన బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సోప్, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్స్ ఈ బేబి కిట్ లో ఉండనున్నాయి. రాష్ట్రంలో సగానికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ జరగనుంది.
