AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..
- ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు ఆమోదం తీసుకున్న సర్కార్..
- సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆర్డినెన్సుకు సర్కార్ ఆమోదం తీసుకుంది. ఇవాళ రాత్రికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుకు కాలపరిమితి రేపటితో ముగియనుండటంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సు జారీ చేసింది. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆమోదం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు రూ. 1.30 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Miss global india: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఇక, 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జీవో జారీ చేసింది. అన్న క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల రిపేర్లు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. రోడ్ల మరమ్మతులకు రూ. 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేశారు. ఆగష్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం.. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్టు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలలు సమయం పడుతుందని ఏపీ సర్కార్ భావిస్తుంది. 2024 సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!