కరోనా మహమ్మారి ఎంట్రీ అయిన తర్వాత ప్రతీరోజు కరోనా కేసులు, రికవరీ కేసులు, యాక్టివ్ కేసులు.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఇలా పూర్తి వివరాలు వెల్లడిస్తూ వస్తుంది వైద్య ఆరోగ్యశాఖ.. ఉదయం 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు అంటే 24 గంటల పాటు నమోదైన వివరాలను బులెటిన్ రూపంలో విడుదల చేస్తూ వస్తోంది.. అయితే, ఇవాళ్టి నుంచి కరోనా బులెటిన్ ఇవ్వకూడదని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది…
Read Also: Hyderabad: కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్
రాష్ట్రవ్యాప్తంగా గత పదిరోజులుగా పది కంటే తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.. ఈ మధ్య ఒకరోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో రోజు విడుదల చేసే కరోనా బులెటిన్లను ఆపేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయానికి వచ్చింది. అయితే, కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అలెర్టుగా ఉండాలని స్పష్టం చేసింది వైద్యారోగ్య శాఖ.