NTV Telugu Site icon

YS Jagan: రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపే ఆ సొమ్ము ఖాతాల్లోకి..

రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రేపు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్… రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు.. రాష్ట్రంలోని 5,71,478 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా లబ్ధి చేకూరనుంది.. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.534.77 కోట్లు జమ చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్‌ యంత్రసేవా పథకం క్రింద 29.51 కోట్ల లబ్ధి చేకూరబోతోంది… మొత్తం 564.28 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: AP Covid 19: నైట్‌ కర్ఫ్యూపై కీలక నిర్ణయం