Site icon NTV Telugu

AP GOVT : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Whatsapp Image 2023 06 27 At 10.01.24 Am

Whatsapp Image 2023 06 27 At 10.01.24 Am

ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉండనున్నాయి.గతం లో ఇదేవిధంగా పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియ బోతుంది.. దీనితో ఉద్యోగ సంఘాల చేసిన వినతి మేరకు ప్రభుత్వం మరో సంవత్సరం పాటు గడువుని పొడిగించింది. దీంతో సీఎం జగన్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయిన వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం.

వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.. 2016 లోమొదట ఈ విధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి విధంగా వారిని ప్రోత్సహించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రతి సంవత్సరం కూడా ఈ విధానాన్ని పొడిగిస్తూ ఉంది.జగన్ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు సమాచారం.. తాజాగా మరో సంవత్సరం ఈ విధానాన్ని పొడిగించారు.ఎన్నికల సంవత్సరం కావడం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్డ్లీ ప్రభుత్వం అని ఉద్యోగులకు ఎప్పుడూ అనుకూలంగా వుంటుందనీ.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు ను కోరుకుంటుందని మంత్రులు తెలియజేస్తున్నారు.

Exit mobile version