ఏపీ పీఆర్సీ రగడ సామాన్య ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలు అంటూనే .. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు నేరవేరిస్తేనే చర్చలకు వెళ్తామంటూ భీష్మించుకుని ఉన్నారు. దీంతో సగటు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇంకా జీవో ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొన్నది.
Read Also: ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ
ఇప్పటికే ఆయా విభాగాలకు చేరిన ఉద్యోగుల పదవీ విరమణల ఫైళ్లు. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఆర్థిక శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇటీవల కేబినెట్లోనూ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం. దీనిపై ఆర్డినెన్సు జారీ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే గవర్నర్ ఆమోదం పొందినట్టు సమాచారం. ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ రాకుంటే ఉద్యోగుల పరిస్థితి ఏంటో అనేది తెలాల్సి ఉంది.
