Site icon NTV Telugu

కేంద్రం బాటలో ఏపీ సర్కార్.. ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్..!

AP Govt

కేంద్రం బాటలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్ మెంట్ కోసం అప్పగించింది ప్రభుత్వం. దీని కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ గెస్ట్ హౌస్ ను లక్ష చదరపు మీటర్లల్లో స్టేట్ గెస్ట్ హౌస్ పునః నిర్మాణం చేస్తారు. రెండున్నర లక్షల చదరపు మీటర్లల్లో కమర్షియల్ డెవలప్ మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేయనుంది రుద్రాభిషేక్ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీతో సమన్వయం చేసుకుంటూ మిషన్ బిల్డ్ ఏపీని అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రుద్రాభిషేక్ సంస్థకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను అప్పగించింది ఎన్బీసీసీ.

Exit mobile version