NTV Telugu Site icon

సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏడాది పాటు భూముల మార్కెట్‌ ధర మారదు..

AP Government

AP Government

భూముల మార్కెట్‌ ధర సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… ఏడాది పాటు భూముల మార్కెట్‌ ధరలను సవరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది… వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్‌ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది… కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్‌ ధరల విషయంలో సవరణ చేయకూడదని ప్రభుత్వం భావించగా.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ.. దీంతో.. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి.. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ ధరలను భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.