Site icon NTV Telugu

Andhra Pradesh: అమరావతిలో భవనాల లీజు.. సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

Ap Crda Min

Ap Crda Min

ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధులు అవసరం. కానీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధికి నిధుల కోసం సీఆర్‌డీఏ మరింత కసరత్తు చేస్తోంది. రాజధాని పరిధిలో పూర్తయిన భవనాలను లీజుకివ్వాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు చేసింది. రాజధానిలో గ్రూప్‌-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విట్‌ యూనివర్సిటీకి ఇందులో ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విట్ యాజమాన్యంతో సీఆర్‌డీఏ సంప్రదింపులు కూడా జరిపింది.

భవనాల లీజు ద్వారా ఏడాదికి రూ. 8-10 కోట్ల మేర లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక టవర్‌లోని 120 ఫ్లాట్లను లీజుకు ఇచ్చి ఆదాయం ఆర్జించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన డీ-టైప్ భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఆరు టవర్లతో డీ-టైప్ బిల్డింగ్ నిర్మాణాలు జరగ్గా.. ముందుగా ఓ టవరును లీజుకివ్వాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. 2019 నాటికే 7.7 ఎకరాల విస్తీర్ణంలో 720 ఫ్లాట్లను సీఆర్డీఏ నిర్మించింది. 65శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. 10,22,149 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా కూడా అందుబాటులోకి వచ్చింది.

Peddi Reddy: చంద్రబాబు హయాంలో వర్షాలు పడలేదు.. రోడ్లు పాడు కాలేదు

Exit mobile version