Site icon NTV Telugu

బడ్జెట్‌ పద్దులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్‌

బడ్జెట్‌ పద్దులపై ఫోకస్‌ పెట్టింది ఏపీ ప్రభుత్వం. పద్దుల నిర్వహణలో పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్‌ కేటాయింపుల వినియోగ లెక్కలను ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించింది.బడ్జెట్ పద్దుల సరైన నిర్వాహాణకు చర్యలు ప్రారంభించింది ఆర్ధిక శాఖ. పద్దుల నిర్వహాణలో వివిధ శాఖల్లో జరుగుతోన్న పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్ని నిధులు వినియోగించారో చెప్పాలని ఆదేశించింది. అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. కేటాయిపుల్లోని హెచ్చు తగ్గులు, ఆదా చేసిన లెక్కలకు సంబంధించిన వివరాలతో పాటు.. వాటికి వివరణ కూడా ఇవ్వాలని ఆదేశించింది. బడ్జెట్ మాన్యువల్లోని ఛాప్టర్-17 ప్రకారం హెచ్చు తగ్గులు, ఆదా లెక్కలను ఆర్ధిక శాఖకు అందివ్వాలని సూచింది. పద్దులను రీ-అప్రాప్రియేషన్ చేసే సమయంలో నిబంధనల మేరకు వివరణతో కూడిన లెక్కలను సమర్పించాలని సూచించింది. సరైన వివరణలు లేకుంటే లెక్కల ఖరారులో ఇబ్బందులు వస్తాయని చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో 143 రీ-అప్రాప్రియేన్ ఆర్డర్లకు సరైన వివరాలు లేవని, పీఏజీ తప్పు పట్టిన అంశాన్ని మెమోలో ప్రస్తావించింది. వివరాలతో కూడిన రీ-అప్రాప్రియేషన్ ఆర్డర్ల ప్రొఫార్మాను అన్ని శాఖలకు పంపింది ఆర్ధిక శాఖ.

Exit mobile version