NTV Telugu Site icon

బెడ్స్‌లేక ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితులు గ‌గ్గోలు..! స‌ర్కార్ ఫోక‌స్..

Hospital Beds

క‌రోనా సెకండ్ వేవ్‌లో భారీగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌డంతో.. ఆస్ప‌త్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది.. దీంతో.. ఆస్ప‌త్రుల్లో బెడ్స్ లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏపీలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్ల కొర‌త ఇబ్బంది పెడుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో.. ఆ బెడ్ల కొర‌త‌పై ఫోక‌స్ పెట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనన్ని ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది ప్ర‌భుత్వం.. బెడ్ల కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతుండ‌డంతో.. అస‌లు ఉన్న బెడ్లు ఎన్ని… ఖాళీగా ఏమైనా ఉన్నాయా? అనేదానిపై ఆరా తీశారు.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 108 ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూ, జనరల్ బెడ్లకు లోటు లేకుండా చూసుకోవాల‌ని ఆదేశించారు.. రాష్ట్ర వ్యాప్తంగా 2106 ఐసీయూ బెడ్లకు గానూ సుమారు 1500 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నట్టు స‌మాచారాన్ని సేక‌రించారు. ఇక‌, 4174 జనరల్ బెడ్లకు గానూ సుమారు 3 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయంటున్నారు అధికారులు.. దీంతో.. బాధితుల‌కు బెడ్లు కేటాయించాల‌ని.. జిల్లాల వారీగా బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ‌.