NTV Telugu Site icon

100 శాతం ఇంటి పన్ను వసూళ్లపై సర్కార్ ఫోకస్‌.. ప్రత్యేక మొబైల్‌ యాప్..

AP Govt

గ్రామాల్లో 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామాల్లో ఇళ్ల పన్నుల వసూళ్లకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా తీసుకొచ్చింది. టెక్నాలజీ సాయంతో 100 శాతం ఇంటి పన్నులను వసూళ్లు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.. బోగస్ చలానాలు.. నకిలీ రసీదుల బెడద ఉండదని స్పష్టం చేస్తున్నారు అధికారులు.. పక్కాగా ఇంటి పన్నుల వసూళ్లైతే గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తోంది వైసీపీ సర్కార్.. ఇక, ఇంటి పన్నుల వసూళ్లకోసం రూపొందించిన ప్రత్యే మొబైల్ యాప్‌ను ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు. ఇంటి పన్నుల వసూళ్లలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా.. టెక్నాలజీ సహాయంతో వసూళ్లకు రెడీ అయిపోయింది ఏపీ సర్కార్.