జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిగారిపల్లెలో వైస్సార్ జగనన్న కాలనీని సందర్శించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.. వాటితో పాటు త్వరితగతిన ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి.. కనెక్షన్లును ఇవ్వాలని తెలిపారు.. ఇక, రూ.127 కోట్ల అంచనా వ్యయంతో మౌళికవసతులు కల్పిస్తున్నట్టు వెల్లడించారు శ్రీకాంత్‌రెడ్డి.
జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి..
Srikanth Reddy