Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు, సూచనలను 15 రోజుల్లోగా చెప్పాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో సూచించింది. అక్టోబరు 28 తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ 15 రోజుల పాటు సీఆర్డీఏకు అభ్యంతరాలుంటే చెప్పాలని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ ప్రతిపాదనల ఆధారంగా ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు

Amaravathi