Site icon NTV Telugu

ఏపీ ఫైబర్ నెట్ లో వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయి…

ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి అని ఎన్టీవీతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా టెండర్లు అప్పగించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉంది. అవకతవకలకు పాల్పడిన అందరిపై చర్యలు ఉంటాయి. నేను గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను అని పేర్కొన్నారు. నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి ఫైబర్ నెట్ 650 కోట్ల అప్పులో ఉంది. ఏపీ ఫైబర్ నెట్ లో వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయి. మరిన్ని ఆధారాలను సీఐడీ, ప్రభుత్వానికి సమర్పిస్తాను అన్నారు.

Exit mobile version