ఏపీలో జవాద్ తుఫాన్ రూపంలో మరో వాన గండం వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలతో ఏపీ రైతాంగం ఆందోళనలో ఉంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇంకా కోలుకోని రైతాంగం… ఈ వర్షాల కారణంగా సగం పండిన వరిని కోసి కల్లాల్లో భద్రపరుస్తున్నారు. కుప్పలు వేసి భద్రపరచినా ధాన్యం రంగు మారే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ధాన్యం రంగు మారినా, మొలక వచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే పాడైన పంటతో సగం నష్టపోయామంటూ, మిగతా వరి పచ్చి దశలోనే కోసి కుప్పలు వేస్తున్నామంటూ , ఏ స్థితిలో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే ఈసారి ఆత్మహత్యలే గతి అంటూ నిరుత్సాహంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
జవాద్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనలో రైతులు…
