Mekathoti Sucharitha: రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు.. అయితే, అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా? అందుకే.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని వ్యాఖ్యానించారు.. నా భర్త ఒక పార్టీలో.. నేను మరొక పార్టీలో.. మా పిల్లలు మరొక పార్టీలో ఉండరని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్ళు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఉండాలనుకున్నామని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతేటి సుచరిత.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయం సాధించి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. కానీ, వైఎస్ జగన్ రెండో కేబినెట్‌లో మాత్రం ఆమెకు మళ్లీ అవకాశం దక్కలేదు.. ఆ తర్వాత సుచరితను మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అంతేకాదు.. మంత్రి పదవి రాకపోవడం.. అలకబూనిన ఆమె.. ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారనే వార్తలు కూడా వచ్చాయి.. అయితే, కేబినెట్ నుంచి మార్చిన తర్వాత ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ బాధ్యతల్ని కట్టబెట్టారు జగన్.. తాను వైసీపీలోనే ఉన్నానని.. వైఎస్ జగన్‌తోనే తమ ప్రయాణం అని ఆమె ప్రకటించారు.. కానీ, ఇప్పుడు రాజకీయాలపై ఆమె చేసిన కామెంట్లు మాత్రం చర్చగా మారాయి.