NTV Telugu Site icon

విద్యుత్ కోతలు ఉండవు.. స్పష్టం చేసిన ఏపీ మంత్రి

భారత్‌లో ఇప్పుడు విద్యుత్‌ సంక్షోభంపై విస్తృతంగా చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్‌ కష్టాలు తప్పవనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా.. విద్యుత్‌ సంక్షోభం లాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇక, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని… రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. నిధులు ఎంతైనా వెచ్చించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చెయ్యాలని సీఎం జగన్‌ ఆదేశించారని గుర్తుచేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని వెల్లడించిన ఆయన.. విద్యుత్ కోతలు ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేసేవారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందన్న మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. అత్యవసర బొగ్గు కొనుగోలుకు 250 కోట్లు జెన్కోకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ విడుదలచేశారని వెల్లడించారు.