NTV Telugu Site icon

LIVE: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ

ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో చర్చలకు హాజరు కావాలని ఆహ్వానించారు శశి భూషణ్. పీఆర్సీ జీఓలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామంటున్నారు ఉద్యోగ సంఘ నేతలు.