ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టారు. పలు చోట్ల పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నారు. మరోవైపు పీఆర్సీ జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పాట పాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల మీద ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి గారూ.. పాదయాత్ర ఇచ్చిన హామీ ఏమైంది సారూ అంటూ పాడుతూ తమ నిరసన గళం విప్పుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పాడుతున్న పాటను మీరూ ఓ లుక్కేయండి.
వీడియో: సీఎం జగన్‌పై పాట పాడుతూ నిరసన తెలిపిన ప్రభుత్వ ఉద్యోగులు
