AP Deputy CM Pawan: తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు.. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది.. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు.. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు.. కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Read Also: Kota Srinivasa Rao: సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయింది: కేసీఆర్
ఇక, అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట శ్రీనివాసరావు చిత్ర సీమకు పరిచయం అయ్యారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు.. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించాము.. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.. కోట శ్రీనివాసరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
