Site icon NTV Telugu

AP Deputy CM Pawan: హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్..

Pawan

Pawan

AP Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్‌ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Nellore Lady Don: లేడీ డాన్ అరుణకు షాకిచ్చిన పోలీసులు.. పీడీ యాక్ట్ నమోదు!

అయితే, పవన్‌ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రచారం జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొనడంతో, ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిత్వ హక్కులను కాపాడటం అత్యంత అవసరం, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సోషల్ మీడియా అకౌంట్లపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పవన్ తరపు న్యాయవాది రెండు రోజుల్లోగా ఈ ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు, లింక్‌లు, స్క్రీన్‌షాట్లు తదితర సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలకు అందజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఆ కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేసింది. ఇక, ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 22కి వాయిదా వేసింది.

Exit mobile version