NTV Telugu Site icon

ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని రంగాల వారు స‌మ్మె బాట ప‌డుతున్న స‌మ‌యంలో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాల‌ని సూచించిన ఆయ‌న‌.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన‌ది.. వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా..? అని ప్ర‌శ్నించారు.. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ గురించి టీచర్లు వాడిన భాష సరైంది కాద‌ని హిత‌వుప‌లికిన ఆయ‌న‌.. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తున్నారా..? అని ప్ర‌శ్నించారు.

Read Also: త‌గ్గేదేలే.. ఎస్మాకు భ‌య‌ప‌డేదేలే.. స‌మ్మెలోకి వైద్యారోగ్య శాఖ సిబ్బంది

ఉపాధ్యాయులు నెల‌కు రూ. 70 వేలు, లక్షల జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నార‌ని మండిప‌డ్డారు డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి.. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్లల్లో ఎందుకు చదివించడం లేదు..? అంటూ నిల‌దీశారు.. వారి సమస్యలేంటో టీచర్లు సీఎంను కలిసి చెప్తే సరిపోయేది… ఏదైనా ఉంటే చర్చలు జరపాలి… కానీ, అలా రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం స‌రైఇంది కాద‌న్నారు నారాయ‌ణ స్వామి.. ఇక‌, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులు చెప్తే కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామ‌ని తెలిపారు.