ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు మొదటగా కేంద్రంపై పోరాటం చేయాలని చెప్పిండి అని సూచించారు.. ఇక, ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడు.. కానీ, చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ వారసుడు అవుతాడు..? అని ప్రశ్నించారు నారాయణస్వామి..
Read Also: Imran Khan: తగ్గేదేలే.. చివరి బంతి వరకూ పోరాటం..
14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎన్టీఆర్‌కు భారతరత్న గురించి డిమాండ్ చేశాడా? అని మండిపడ్డ నారాయణ స్వామి.. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.. అసలు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబు, లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇక, ఎన్టీఆర్‌తో పాటు వైఎస్ఆర్ కు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
