ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విభజనే మనకు పెద్ద నష్టం అన్నారు.. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే నేటికీ ఇబ్బంది పడుతున్నామన్న ఆయన.. విభజన చట్టంలో ఉన్న నియమనిబంధనలకే మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.. తెలంగాణ నేతలకు కూడా మేం అదే చెబుతున్నాం.. జలవివాదాలను పరిష్కరించడంలో కేంద్రం చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, తెలంగాణ మంత్రుల కామెంట్లపై స్పందించిన ధర్మాన.. రాజకీయలబ్ధికోసం కొంతమంది తెలంగాణ మంత్రులు తొందరపాటుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఆ నాడు రాజశేఖర్ రెడ్డి పుణ్యమే… అన్ని ప్రాంతాల్లో జలయజ్ఞం కింద ప్రాజెక్టులు వచ్చాయన్న ఆయన.. నిమిషానికొకలా మాట్లాడే చంద్రబాబు, లోకేష్ మాటలకు అర్ధమేముంది? అని ప్రశ్నించారు.. కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడుతున్న తెలంగాణ మంత్రుల తీరు అన్యాయమన్న ధర్మాన.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం ఎక్కడా ఎవరితోనూ లాలూచీ పడదని.. మేం గొడవలు కోరుకోం.. ప్రజలకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు.