NTV Telugu Site icon

Dharmana: కేసీఆర్‌ వ్యాఖ్యలతో పనిలేదు.. బోర్లకు మీటర్లతో నష్టం లేదు..!

వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో, ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు బిగిస్తున్నారంటూ కూడా ఆయన తెలిపారు.. ఇక, ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు మనకు అనవసరం అన్నారు.. వ్యవసాయ బోర్లకు మీటర్లు వలన రైతులకు ఒక్క రూపాయి నష్టం ఉండదన్న ఆయన.. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది ఉండదు.. ఇది శిలాక్షరాలతో రాసుకోండి అని వ్యాఖ్యానించారు.

Read Also: Hijab: హైకోర్టులో ఆసక్తికర వాదనలు..

ఇక, వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని ప్రకటించారు ధర్మాన కృష్ణ దాస్.. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి రైతులకు అవగాహన లేకపోవడమే కారణంగా తెలిపిన ఆయన.. లేట్ వెరైటీలు పండించడం, పంట నూర్పిడి ఆలస్యంకావడం సమస్యగా మారిందన్నారు.. మిల్లర్లకు సమయానికి ధాన్యం అందించలేఖ పోతున్నారని.. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతోందని.. రైతుల సమస్యలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్.