NTV Telugu Site icon

పవన్ కళ్యాణ్, లోకేష్ లపై విమర్శలు …

Dharmana Krishna Das

Dharmana Krishna Das

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌పై హాట్‌ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… విశాఖ, యలమంచిలి భూసర్వే బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షమైనా, నాయకుడైనా సద్విమర్శలు చేయాలని సూచించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకు ఇష్టం ఉండదన్న ఆయన.. వాళ్లకు ఏ జ్ఞానం ఉండదు… వాళ్ల కంటే గ్రామాల్లో ఉండే సామాన్యులు బెటర్ అంటూ సెటైర్లు వేశారు.. పవన్ కల్యాణ్ మంచి యాక్టర్, లోకేష్‌.. చంద్రబాబు కొడుకు.. అంతే పరిపాలనలో వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికి వాళ్లు సరిపోరని అభిప్రాయపడ్డారు. వాళ్లకు పాలన అనుభవం లేదన్న కృష్ణదాస్.. కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు వైఎస్‌ జగన్ కు వచ్చిన మెజార్టీ ఐదు లక్షల 36 వేలు.. 2014ఎన్నికల్లో
చంద్రబాబు సహా రాష్ట్రంలో అందరికీ వచ్చిన మెజార్టీ అంతా కలిపి ఐదు లక్షలు మాత్రమే అన్నారు.. ఇక, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అంతా ఆందోళన చెందామన్న ఆయన.. ఐదేళ్లు లోకేష్ వంటి అవగాహన లేని వాళ్ల పాలన జరిగింది.. ఇప్పుడు జగన్ పాలన చేస్తున్నారు… వీటన్నింటినీ మీరు బేరీజు వేసుకోవాలని సూచించారు.