ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. సీఎం జగన్ తనను గుర్తించి డిప్యూటీ సీఎం చేశారని, మూడేళ్లు ఖాళీగా ఉన్న తమ్ముడు రేపో, మాపో మంత్రి అవుతాడంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. ఇక, కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jayaram: మా తలరాతలు మార్చేది సీఎం జగనే.. ఆదేశిస్తే కాళ్ల ముందు తల వంచి..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సముచిత నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల్లోకి వెళ్లటానికి మాకు అవకాశం వస్తుందన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… మా తమ్ముడు ప్రసాద్ కూడా మంత్రి కావటానికి సమర్ధుడైన నాయకుడన్న ఆయన.. నా స్థానంలో తమ్ముడికి ఇవ్వడం మంచి నిర్ణయం అవుతుందన్నారు.. గతంలోనూ అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉందని తెలిపారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తానని అప్పుడే చెప్పారని గుర్తుచేసిన ధర్మాన.. ముఖ్యమంత్రి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. ఏం బాధ్యత ఇచ్చినా పార్టీ కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తానని వెల్లడించారు ధర్మాన కృష్ణదాస్.