Site icon NTV Telugu

Kottu Satyanarayana: ప్రతీ మంగళవారం దేవాదాయశాఖపై సమీక్ష.. వారికి డ్రెస్‌ కోడ్‌..

Kottu Satyanarayana

Kottu Satyanarayana

దేవాదాయ, ధర్మాదాయశాఖపై ప్రతీ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ప్రతీ మంగళవారం ధర్మాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష చేపడుతున్నాం, అర్చకులకు సంబంధించిన గౌరవ వేతనం పెంపుదలపై కసరత్తు జరుగుతోందన్నారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేశారు.. అటువంటి ఎయిడెడ్ కాలేజీల గడువు ముగిసిన తర్వాత నిర్వహణ కష్టం అవుతుందని తెలిపారు.. హిత కారిణి సమాజం ద్వారా ఏర్పాటు చేసిన కాలేజీను విద్యాశాఖకు అప్పగించి నిర్వహణ చేయాల్సిందిగా లేఖ రాయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

Read Also: BJP MLA Raja Singh: రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ.. ఆ వ్యాఖ్యలే కారణం

ప్రతీ నియోజకవర్గానికి డీడీఎన్ఎస్ కింద ప్రాధాన్యత ఇచ్చే విధంగా 5 వేల వరకు ఇస్తున్నామని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. దీన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారన్న ఆయన.. ఈ పెంపు ప్రతిపాదనపై కూడా కసరత్తు చేస్తున్నాం.. దేవాదాయ భూముల కోర్టు కేసులకు సంబంధించి చర్చించాం, 9 స్టాండింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయమని అడ్వకేట్ జనరల్‌ను కోరామన్నారు.. కోర్టులో కేసులకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ , స్టాండింగ్ కౌన్సిల్‌ విచారణకు వచ్చిన రోజు ఫాలో అప్ చేసి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. ఇక, దేవాలయాల్లో పని చేసే సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలులోకి తీసుకుని రావాలి సంబంధిత అధికారులను ఆదేశించారు.. దసరా ఉత్సవాలు నిర్వహించే ఆలయాలకు సంబంధించి ఈ నెల 25న పోలీసు, ఆర్ అండ్ బీ, దేవాదాయ, ఇతర శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Exit mobile version