Site icon NTV Telugu

Andhra Pradesh: సీఎస్ సమీర్‌శర్మకు అస్వస్థత.. హైదరాబాద్ తరలింపు

Cs Sameer Sharma

Cs Sameer Sharma

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆరోగ్యం కుదుటపడిన పిమ్మట సీఎస్ సమీర్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉంది.

Read Also: State Bank Of India: నిరుద్యోగులకు శుభవార్త.. 1,422 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది మే నెలలో మరో ఆరు నెలలు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని నవంబరు 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్‌ పదవీకాలాన్ని కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొదటిసారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్‌ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు.

Exit mobile version