NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త‌గా 1843 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,48,592కి చేరింది.  ఇందులో 19,11,812 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 23,571 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 12 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 13,209 మంది మృతి చెందారు.  రాష్ట్రంలో 24 గంట‌ల్లో 70,727 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2,39,09,363 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్‌య‌శాఖ తెలియ‌జేసింది.  రాష్ట్రంలో అత్య‌ధికంగా చిత్తూరులో 301, ప‌శ్చిమ గోదావ‌రిలో 235, ప్ర‌కాశం జిల్లాలో 232, తూర్పు గోదావ‌రిలో 222, నెల్లూరులో 203 కేసులు న‌మోద‌య్యాయి.  రోజువారి కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నా తీవ్ర‌త త‌గ్గ‌లేద‌ని, జాగ్ర‌త్త‌గాఉండాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.  మూడో వేవ్ ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో ప్ర‌భుత్వం అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  

Read: రాంచరణ్-శంకర్​ చిత్రం: షూటింగ్​పై దిల్ రాజు క్లారిటీ!