ఏపీ సీఎం వైఎస్ జగన్.. రేపు (మంగళవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు.. ఆయా పాఠశాలల్లోని 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.. ఇక, కిట్ల కోసం రూ.931.02 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ప్రతి విద్యార్ధికీ దాదాపు రూ.2 వేలు విలువైన జగనన్న విద్యా కానుక అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది..
Read Also: Santosh Bangar: ఉద్దవ్ కోసం ఎక్కి ఎక్కి ఏడ్చిన ఎమ్మెల్యే.. ట్విస్ట్ మామూలుగా లేదు..!
అయితే, విద్యాకానుక కోసం గత మూడేళ్లలో ఇప్పటివరకు రూ.2,368.33 కోట్లు వ్యయం చేసినట్లు వివరించింది. 2018–19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య ఇప్పుడు 7 లక్షలకు పైగా పెరిగినట్టు అధికారులు. మరోవైపు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది.. ఇక, పాఠశాలలు తెరిచిన రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.52,676.98 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలకు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.