ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్… ఆ తర్వాత కర్నూలు వెళ్లనున్నారు.. ఇక, ఉదయం 11.15 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పంచలింగాల గ్రామానికి చేరుకోనున్నారు.. పంచలింగాలలో జరగనున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.. మరోవైపు.. పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది.. ఇవాళ సాయంత్రం మరోసారి ఉద్యోగ సంఘలతో చర్చలు సాగనున్నాయి.. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై ఇవాళ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
నేడు కర్నూలుకు సీఎం జగన్.. విషయం ఇదే..
