NTV Telugu Site icon

ఏపీలో నేడు రెండో విడత వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల‌…

ఏపీలో సంక్షేమ పథకాలు వేగంగా అమ‌ల‌వుతున్నాయి.  లాక్‌డౌన్ స‌మ‌యంలో పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు వివిధ ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్నారు.  ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత రెండో విడ‌త ప‌థ‌కాన్ని ఈరోజు అమ‌లు చేయ‌బోతున్నారు.  తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వ‌ర్చువ‌ల్‌గా సీఎం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో 23,14,342 మంది మ‌హిళ‌ల‌కు లబ్ది చేకూరుతుంది.  ల‌బ్దిదారుల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయ‌ల‌ను సీఎం జ‌గ‌న్ జ‌మచేయ‌బోతున్నారు. గ‌తేడాది ఈ ప‌థ‌కానికి సంబందించి తొలివిడ‌తను అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  

Also Read: సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్