సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్

సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ విడుదల కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి గల్లా అమర రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తన కొడుకు తొలి సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

Read Also : “అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ టైటిల్ ఇదే?

రేపు ఈ చిత్రం టైటిల్ టీజర్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గల్లా అశోక్ మొదటి చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-