వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్… కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీలు, హెల్త్ హబ్స్‌పై చర్చించారు.. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఆరా తీసిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించిన ఆయన.. ఆ రకమైన వైద్య సేవలు స్ధానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు.
ఇక, మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం వైఎస్ జగన్… కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు చేయాలన్న ఆయన.. జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావాలన్నారు. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?