NTV Telugu Site icon

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

ys jagan

వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌… కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌, మెడికల్‌ కాలేజీలు, హెల్త్‌ హబ్స్‌పై చర్చించారు.. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై ఆరా తీసిన ఆయన.. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్.. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించిన ఆయన.. ఆ రకమైన వైద్య సేవలు స్ధానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు.

ఇక, మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం వైఎస్‌ జగన్… కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు చేయాలన్న ఆయన.. జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.