NTV Telugu Site icon

Permanent Land Rights: భూముల సమగ్ర రీసర్వే.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Ys Jagan

Ys Jagan

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రీ – సర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని స్పష్టం చేసిన సీఎం.. వందేళ్ల తర్వాత మరలా సర్వే చేస్తున్నాం అంటే నిజంగానే కొత్త చరిత్ర లిఖిస్తున్నట్లే.. రీ సర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలి.. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలని స్పష్టం చేశరాఉ.. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. తొలివిడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని.. జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి కావాలన్నారు సీఎం..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

అయితే, తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92వేలు ఫస్ట్‌ టైం ఎంట్రీస్‌ జరగ్గా, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామని.. 4.30 లక్షల సబ్‌ డివిజన్లు పూర్తి చేసినట్లు, 19వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయని సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు. 2023, పిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.. అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని వెల్లడించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలన్న సీఎం.. 22– ఏ సమస్య పరిష్కరించి హక్కు పత్రాలు అందజేసిన లబ్ధిదారులకు లేఖలు రాయాలని సూచించారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి వారికి జరిగిన మేలును తెలియజేసేలా.. లబ్ధి పొందిన ప్రతి వారికి వ్యక్తిగతంగా లేఖ రాయాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్.. హక్కు పత్రాలు పొందిన వారందరికీ లేఖలు రాయాలన్న సీఎం. సమగ్ర భూసర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. భూగర్భ గనులుశాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.