వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన.. రేపు ఒంగోలు వెళ్లనున్నారు.. ఇక, శుక్రవారం ఒంగోలు వేదికగా.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికోసం రేపు ఉదయం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి.. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ఆయన.. అనంతరం వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
Read Also: CM YS Jagan: ఏపీ సీఎం కీలక ప్రకటన.. వారిపై కేసులు ఎత్తివేత..
ఇక, ఆ కార్యక్రమం అనంతరం బందర్ రోడ్‌లోని రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళ్లి, వారి కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్. కాగా, వరుస పర్యటనలతో జిల్లాలను చుట్టేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అవకాశం దొరికినప్పుడల్లా.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు.