NTV Telugu Site icon

CM Jagan: ఆర్తికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ.. పలు అంశాలపై చర్చ

Jagan Nirmala Sitaraman

Jagan Nirmala Sitaraman

AP CM YS Jagan Met With Nirmala Sitaraman In Delhi: శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన ఈ ఇద్దరి మధ్య.. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిగాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌కు అందించిన సహాయానికి నిర్మలాకు కృతజ్ఞతలు తెలియజేసిన జగన్.. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్యకాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులు వంటి అంశాలపై చర్చించారు.

Pawan Kalyan: ఆయనను మర్చిపోలేం.. పవన్ ఎమోషనల్

రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌, రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాలను సైతం ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఆయన పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ జెన్‌కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరం ఉందని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ డబ్బు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. స్కూళ్లలో నాడు-నాడు కార్యక్రమం కింద రూ.6 వేల కోట్లు ఖర్చుచేసిందని, తొలిదశ కింద 15,717 స్కూళ్లలో నాడు-నేడు కూడా పూర్తయ్యిందని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం తెలియజేశారు.

Vanitha Vijay Kumar: సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు.. నా తండ్రే నన్ను

అలాగే ఆరోగ్య రంగంలోనూ నాడు -నేడు కింద అనేక చర్యలు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకూ పనులు చేపట్టామని సీఎం జగన్ వివరించారు. ఇందుకు గాను రూ. 4వేల కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభవిష్యత్తును తీర్చిదిద్దుతాయని, వీటి కోసం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాలని ఆర్థికమంత్రిని సీఎం కోరారు. నిర్మలా సీతారామన్ సానుకూలంగానే స్పందించారని సమాచారం. కాగా.. రేపు నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.