Site icon NTV Telugu

YS Jagan Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ కీలక చర్చలు.. వీటిపైనే ఫోకస్‌..!

Ys Jagan

Ys Jagan

YS Jagan Meets Nirmala Sitharaman: బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. ఇక, ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం..

Read Also: Life Threatening: హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన 9వ తరగతి విద్యార్థి.. నన్ను చంపేందుకు కుటుంబ సభ్యుల కుట్ర..!

ఇక, కేంద్ర ఆర్థికశాఖ మంత్రితో ముఖ్యమంత్రి జగన్‌ చర్చించిన అంశాల విషయానికి వెళ్తే.. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరారు.. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా.. రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించిన సీఎం. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు సీఎం జగన్‌.

మరోవైపు, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు సీఎం.. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరిన సీఎం. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version