అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇక, రెండో ఫేజ్ పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు.. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించింది.. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్ మూడోది. తొలి దశ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఏపీ సీఎం. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనున్నట్టు అంచనా వేస్తున్నారు.. ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా భూమి పూజ నిర్వహించారు. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్‌లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Mukesh Ambani family Live : ముకేశ్ అంబానీ కుటుంబాన్ని లేపేస్తాం.!